Home  »  Bollywood News  »  క్రేజీ కాంబినేషన్.. రాజమౌళి దర్శకత్వంలో రణ్‌ బీర్‌ కపూర్!

Updated : Dec 18, 2021

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలని ఎందరో స్టార్స్ ఆశపడుతుంటారు. బాలీవుడ్ స్టార్ రణ్‌ బీర్‌ కపూర్ సైతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. తాజాగా జరిగిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రెస్ మీట్ లో రాజమౌళి, రణ్‌ బీర్‌ మాటలను గమనిస్తే.. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

Also Read: 'పుష్ప' మూవీ రివ్యూ

శనివారం హైదరాబాద్ లో రాజమౌళితో కలిసి బ్రహ్మాస్త్ర మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "బాలీవుడ్ లో నా ఫేవరెట్ యాక్టర్ రణ్‌ బీర్‌ అని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే తను నటిస్తున్నట్లు అసలు అనిపించదు. ఓవర్ గా ఎక్స్ ప్రెస్ చేయడు. ఇంటెన్సిటీ అంతా కళ్ళలోనే చూపిస్తాడు. సంజూ, రాక్ స్టార్ వంటి సినిమాల్లో ఆయన చేసిన ఫర్మార్మెన్స్ హార్డ్ హిట్టింగ్ గా టాప్ అఫ్ ది వరల్డ్ అన్నట్టు ఉంటాయి" అంటూ ప్రశంసించాడు.

Also Read: అత్తగారింట్లో 'కత్రినా' వండిన తొలి వంటకం ఏంటో తెలుసా?

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో రణ్‌ బీర్‌ కూడా రాజమౌళిపై తనకున్న అభిమాని చాటుకున్నాడు. రణ్‌ బీర్‌ వేదిక పైకి రాగానే రాజమౌళి కాళ్లకి దణ్ణం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అంతేకాకుండా, ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్ లోనే ప్రజెంట్ నా ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అని రణ్‌ బీర్‌ చెప్పాడు. అలాగే తెలుగులో సినిమా చేస్తారా అన్న ప్రశ్నకు రణ్‌ బీర్‌ స్పందిస్తూ.. తప్పకుండా చేస్తానని,  రాజమౌళి గారు కూడా ఇది వింటున్నారని అన్నాడు. అంతేకాదు సినిమాకి భాషతో సంబంధం లేదని, కథ నచ్చితే ఏ భాషలోనైనా సినిమా చేస్తానని రణ్‌ బీర్‌ చెప్పుకొచ్చాడు.

Also Read: పుష్ప‌.. అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన హిందీ వెర్ష‌న్‌!

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో రాజమౌళి, రణ్‌ బీర్‌ ఒకరిపై ఒకరు చాటుకున్న అభిమానాన్ని చూస్తుంటే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ని ఏ ప్రొడ్యూసర్ సెట్ చేస్తారో చూడాలి. ఆ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.